సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (22:41 IST)

September 2021: మీ మాస రాశి ఫలాలు

Astrology
మేషరాశి: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
గౌరమర్యాదలు పెంపొందుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ప్రతిఫలం ఆశించవద్దు. పదవుల నుంచి తప్పుకుంటారు. ఒక మంచి చేసామన్న తృప్తి వుంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం శ్రేయస్కరం. బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కార్మికులకు పనులు లభిస్తాయి.
 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మనసు కుదుటపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉపాధ్యాలకు పురస్కార యోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
 
మిథునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా అడుగులువేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. సంతానం పైచదువులపై శ్రద్ధ వహించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. ప్రయాణం కలిసివస్తుంది.
 
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. ఆర్థిక విషయాలు గోప్యంగా వుంచండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. కార్మికులకు పనులు లభిస్తాయి.
 
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అతిగా శ్రమించవద్దు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిర్మాణాలు పుంజుకుంటాయి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అవివాహితులకు శుభయోగం. విద్యార్థులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యవహారాలతో తీరిక వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తి కావు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. సంతానం భవిష్యత్తుపైన దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి కష్టకాలం.
 
 
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గుట్టుగా వ్యవహరించాలి. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు అనుకున్నప్రకారం సాగవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. అసాంఘిక కార్యక్రమాలు జోలికి పోవద్దు.
 
 
 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను సన్నిహితుల ద్వారా తెలియజేయండి. గృహమరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, స్తానచలనం. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు.
 
 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకమే. కార్యం సిద్ధిస్తుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. జాతక పొంతన ప్రధానం. పదవుల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పనివారలతో జాగ్రత్త. ఉపాధ్యాయులకు శుభయోగం. అధికారులకు ధనప్రలోభం తగదు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభాకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులు చేరువవుతారు. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. వాయిదాపడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తికాగలవు. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. రోజులు భారంగా గడుస్తున్నట్లునిపిస్తాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆశించిన పదవులు దక్కవు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కార్మికులు, చేతివృత్తుల వారికి కష్టకాలం. పిల్లలకు వాహనం ఇవ్వవద్దు.
 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆలోచించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఉపాధ్యాయుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వాయిదా పడిని మొక్కులు తీర్చుకుంటారు.