ఆఫ్ లైన్‌లోనే విద్యా బోధన.. ఆన్‌లైన్ క్లాసులొద్దు...
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ తెరుచుకోవాల్సిందేనని.. ఆఫ్ లైన్ లోనే విద్యా బోధన జరగాలని చెప్పింది. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు అవకాశం లేదని వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండడంతో.. ప్రైవేటు యాజమాన్యాలన్నీ బిజీబిజీగా ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లోనూ శుద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అయితే.. విద్యాసంస్థలు తెరవాలని సర్కారు ఆదేశించినప్పటికీ.. పలు సందేహాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టత లేకపోవడం కూడా ఈ సందేహాలకు కారణమవుతోంది.
ఆన్ లైన్ విద్యకు అవకాశం లేదని, ప్రత్యక్ష బోధనకే సిద్ధం కావాలని ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం.
అంతేకాదు.. విద్యాశాఖ పాఠశాలలకు జారీచేసిన మార్గదర్శకాల్లోనూ ఈ విషయం చెప్పలేదు. టీవీ పాఠాలు బోధించే టీశాట్ అధికారులకు కూడా ఈ విషయమై అధికారిక సమాచారం ఏదీ అందలేదని చెబుతున్నారు.