శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (12:43 IST)

పందుల వేటకు తయారు చేసిన నాటుబాంబు : పేలి ఒకరికి గాయం

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ నాటుబాంబు పేలింది. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌లో అడవి పందుల వేట కోసం తయారు చేసిన నాటు బాంబు ఒక్కసారిగా పేలింది. 
 
ఈ పేలుడుతో కుల్దీప్‌సింగ్‌ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని దవాఖానాకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుల్దీప్‌ సింగ్‌ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.