మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (12:39 IST)

ఎగబడిన కార్యకర్తలు - బండి సంజయ్ కాలికి గాయం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కాలికి గాయమైంది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద ప్రమాదవశాత్తు ఈ గాయమైంది. సంజయ్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీ పడటంతో తోపులాట జరిగింది. 
 
దీంతో ఆయన కిందపడిపోయారు. దీంతో గాయమైంది. వైద్యులు సంజయ్ కాలికి ప్లాస్టర్ వేశారు. అయినా సోమవారం (మూడో రోజు) యాత్ర యాధావిధిగా కొనసాగుతుందని బీజేపీ ప్రకటించింది.