తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా సునీల్ నారంగ్
Telangana state Film Chamber of Commerce
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. శనివారం (28 ఆగస్ట్) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ బాడీ రెండేళ్ళ కాలపరిమితి. రాబోవు రెండు సంవత్సరాలకుగానూ( 2021-23 వరకు) కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని సినిమారంగంపై పలు సమస్యలను ప్రభుత్వంపరంగా తీసుకువచ్చి సినిమా అభివృద్ధి దిశగా పయనిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యవర్గంలో అధ్యక్షునిగా సునీల్ నారంగ్, ఉపాధ్యక్షులుగా బాలగోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్.శ్రీధర్, ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్), కార్యదర్శి - కె.అనుపమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి - జె.చంద్రశేఖర్ రావు, కోశాధికారి - ఎం.విజేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
కార్యవిర్వాహక కమిటీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ)లో - బి.లింగం గౌడ్, పి.సుబ్రమణ్యం, డి.విష్ణు మూర్తి, రవీంద్ర గోపాల్. జి.శ్రీనివాస్, బి.సత్యనారాయణ గౌడ్, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల రమేశ్, బి.విజయ్ కుమార్, కె.ఉదయ్ కుమార్ రెడ్డి, ఎం.నరేందర్ రెడ్డి, ఎం.మోహన్ కుమార్, కె.అశోక్ కుమార్ వున్నారు.