శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (15:32 IST)

టీకా వేయించుకోకుంటే రేషన్ బంద్.. కేంద్రానికి పోటెత్తిన ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక వ్యాక్సిన్ క్యాంపులు ఏర్పాటు చేసిన టీకాలు వేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారంటూ కొందరు పుకార్లు పుట్టించారు. దీంతో ఆరోగ్య కేంద్రానికి ప్రజలు పోటెత్తారు. 
 
నవీపేట్ మండల కేంద్రంలో మంగళవారం నుంచి టీకా ఇవ్వరని.. అది తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారని కొందరు వదంతులు సృష్టించారు. దీంతో 700 మందికి పైగా ప్రజలు స్థానిక ఆరోగ్య కేంద్రానికి పోటెత్తారు. 
 
ఉదయాన్నే వచ్చి క్యూలైనల్లో నిల్చుని ఇబ్బందులు పడ్డారు. టీకా కోసం పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో 500 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.