మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (19:22 IST)

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 19 ఏళ్ల యువకుడు మృతి

కోవిడ్ వ్యాక్సిన్ వికటించడంతో 19 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 21న పాలకొల్లులో సూర్యతేజ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఐతే టీకా తీసుకున్న రెండు గంటలకే వాంతుల చేసుకుంటూ స్పృహ తప్పి పడిపోయాడు.
 
మెరుగైన వైద్యం కోసం అతడిని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ అతడికి వెంటిలేటర్ పైన వుంచి చికిత్స అందించారు. ఐతే గత మూడురోజులుగా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడిన యువకుడు ఈరోజు కన్నుమూశాడు. టీకా వేయడం వల్ల తమ కుమారుడు చనిపోయాడంటూ అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.