1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (12:53 IST)

మ‌ల్ల‌య్య స్వామి కొండ‌పై పూజ చేస్తూ...ఇలా జారి ప‌డి...

అంద‌రూ చూస్తుండ‌గానే, ఈ ఘోరం జ‌రిగిపోయింది. శ‌నివారం ఉద‌యం... మ‌ల్ల‌య్య స్వామి కొండ‌పై పూజ‌లు చేస్తూండ‌గా, హార‌తి ఇస్తూ, పూజారి జారి ప‌డ్డాడు.

కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా సింగనమలలోని గంపమల్లయ స్వామి కొండపై పూజ‌లు చేస్తూ, పూజారి జారిపడి మరణించాడు. కొండ కింద నుంచి పూజ‌ను తిల‌కిస్తూన్న కొంద‌రు గ్రామ‌స్తులు, దీన్ని త‌మ సెల్ ఫోన్ లో వీడియో తీశారు.

వాళ్ళు కొండ‌పై జ‌రుగుతున్న పూజ తంతును వీడియో తీస్తుండ‌గా, హ‌ఠాత్తుగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దీనితో పూజ‌లో ఉన్న భ‌క్తులంతా హ‌తాశుల‌య్యారు. కొండ‌పై అస‌లే వ‌ర్షంగా ఉండ‌టంతో, రాయిపై కాలు జారి ప‌డి, పూజారి కింద ప‌డిపోయిన‌ట్లు స్థానికులు చెపుతున్నారు.