1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:05 IST)

తాలిబాన్ భయంతో విమానం రెక్కపైకి ఎక్కిన సాకర్ ప్లేయర్, టేకాఫ్ అయ్యిందంతే...

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ వశం చేసుకున్నారన్న వార్త తెలియడంతో విమానాశ్రయాలకు ఎందరో పరుగులు తీసారు. సోమవారం నాడు వందల సంఖ్యలో ప్రజలు విమానాశ్రయం వైపు బారులు తీరి కనిపించారు. యూఎస్ మిలటరీ విమానం సరుకు దించేందుకు రాగానే దాన్ని చుట్టుముట్టి అందులో ఎక్కేందుకు విమానం వెంటపరుగులు తీసారు. అందులో ఆఫ్ఘన్ సాకర్ క్రీడాకారుడు కూడా వున్నాడు.
 
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలాగైనా తరలిపోయి ప్రాణాలు దక్కించుకోవాలనుకున్న ఆ యువ క్రీడాకారుడు జాకీ అన్వారీ విమానంలో చోటు లేకపోవడంతో విమానం పైకి ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో విమానం టేకాఫ్ అయ్యింది. అంతే... విమానం పైనుంచి జారిపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇతడు ఆఫ్ఘాన్ జాతీయ ఫుట్ బాల్ జట్టులో సభ్యుడు.