1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (16:57 IST)

గోవాలో రష్యా అమ్మాయిల మృతదేహాలు...

అంతర్జాతీయ సముద్రతీర పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన గోవాలో ఇద్దరు రష్యా యువతుల మృతదేహాలు కలకలం రేపాయి. గోవాలోని శివోలీ మపుసా ప్రాంతం వద్ద ఇద్దరు రష్యా యువతులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. 
 
విహారయాత్ర కోసం వారు కొన్నాళ్ల కిందట భారత్ వచ్చారు. అయితే దేశంలో లాక్డౌన్ కారణంగా ఆ రష్యా యువతులు గోవాలోనే ఉండిపోయారు. ఇప్పుడు వారిద్దరూ శవాలై తేలారు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మరణించిన వారిని ఎక్తెరినా టికోవా, అలెగ్జాండ్రా రిజావిగా గుర్తించారు. వారిద్దరూ తమ గదుల్లో విగతజీవులై పడివుండగా గుర్తించారు. వీరిద్దరూ ఏ విధంగా మృతిచెందారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.