1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (17:32 IST)

గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు విద్యార్థులు మృతి

గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సీబీఐటీ కాలేజీ రోడ్డులో కరెంట్ పోల్‌ను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఏపీ09 సీజే 2095 స్విఫ్ట్ డిజైర్ కారు విద్యుత్ పోల్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టగా.. ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి.
 
అయినా, కూడా ప్రాణనష్టం సంభవించింది. అంతేకాకుండా, కారులో వెడ్డింగ్ కార్డులు లభ్యమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.