శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (13:41 IST)

గోవా బీచ్‌లో అర్థనగ్నంగా మహిళ మృతదేహం

గోవా బీచ్‌లో ఇటీవల ఓ యువతి మృతదేహం అర్థనగ్నంగా లభ్యమైంది. ఇది కలకలం రేపుతోంది. ఆ యువతి మరణంపై ఆమె కుటుంబీకులు, సన్నిహితులు, మహిళా సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
 
గోవాలోని ప్రసిద్ధ కలంగుటె బీచ్‌లో ఈ నెల 12న అర్థనగ్నంగా యువతి మృతదేహం లభ్యమైంది. సముద్రనీటిలో మునిగి ఆమె మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు ఆమె సముద్రనీటిలో పడి చనిపోయి ఉండొచ్చు లేదా సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న వాదన వినిపిస్తున్నారు. 
 
పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆమెపై లైంగిక దాడి లేదా భౌతిక దాడి జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఆ యువతి మరణంపై ఆమె కుటుంబీకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఎవరో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి సముద్రనీటిలో తోసి హతమార్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు 
 
అటు గోవా బీచ్‌లో యువతి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. మపుసా పోలీస్ స్టేషన్‌తో పాటు గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు.