శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 31 మే 2021 (10:10 IST)

గ్రామాల‌కు డెడ్ బాడీ ఫ్రిజ‌ర్ బాక్స్‌ల‌ను అందిస్తున్న సోనూసూద్‌

Dead Body Freezer Box
క‌రోనా స‌మ‌యంలో దేశంలో ప్ర‌భుత్వాలు చేయ‌ని ప‌నిని సోనూసూద్ చేయ‌డం ప్ర‌పంచ‌ వ్యాప్తంగానూ, పాన్‌ ఇండియా లెవ‌ల్‌లో అనూహ్య‌మైన పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇటీవ‌లే దేశంలో ఆక్సిజ‌న్ ల‌ను సైతం అందిస్తున్న సోసూసూద్ ఇప్పుడు తాజాగా సోమ‌వారంనాడు మ‌రో గొప్ప ప‌నికి శ్రీ‌కారం చుట్టారు. గ్రామాల‌కు డెడ్‌బాడీ ఫ్రిజ‌ర్ బాక్స్‌ల‌ను అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.
 
సోనూసూద్ ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల‌లో మృత‌దేహాల సంర‌క్ష‌ణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రిజ‌ర్ బాక్స్‌ల‌ను సోసూ ఇస్తున్నారు. ఇందులో భాగంగా సంకిరెడ్డి ప‌ల్లి, ఆషాంపూర్ బోంకూర్‌, ఓర్వ‌క‌ల్‌, మ‌ద్దికెరతోపాటు ఇత‌ర మారుమూల గ్రామాల‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అనేక గ్రామాల‌లో ఫ్రీజ‌ర్ బాక్సులు లేక‌పోవ‌డంతో ఆ గ్రామ‌ స‌ర్పంచ్‌లు స‌హాయం కోసం సోననూసూద్‌ను సంప్ర‌దించారు. 
 
ఇన్నాళ్ళు ఈ గ్రామాల‌కు న‌గ‌రం నుంచి ఫ్రిజ‌ర్ బాక్స్‌ల‌నురావ‌డానికి ఇబ్బందులు ప‌డ్డారు. దీని వ‌ల్ల శవాలు కుల్లిపోయి అయిన వారికి చివ‌రి చూపుకు దూర‌మ‌య్యేవారు. దాంతో గ్రామ స‌ర్పంచ్‌లు సోనూసూద్‌ను కోర‌డంతో త్వ‌ర‌గా బాక్సుల‌ను అందుబాటులో వుంచుతామ‌ని స‌ర్పంచ్‌ల‌కు సోనూ హామి ఇచ్చారు.