బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మే 2021 (08:40 IST)

మూడు రాజధానుల ఏర్పాటు చేసి తీరతాం : మంత్రి బొత్స

మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్నీ నెరవేర్చేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు 94 శాతం నెరవేర్చారని.. చెప్పనివీ మరో 40 హామీలు అదనంగా అమలు చేశారన్నారు. వైకాపా రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు.
 
అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతిలబ్ధిదారుడికి ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేసినట్లు చెప్పారు. రెండేళ్ల పాలనపై సీఎం జగన్‌ విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి లబ్ధిదారుడికీ చేరవేస్తామన్నారు. 
 
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడమే తమ విధానమని.. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరతామని మంత్రి బొత్స సత్తిబాబు పునరుద్ఘాటించారు.