మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 21 ఆగస్టు 2021 (13:08 IST)

36 ఏళ్ల మహిళ అతడితో నవ్వుతూ హోటల్లోకి వెళ్లింది, గదిలో ఏమైందో గొంతు కోసి...

హర్యానాలోని గురుగ్రాంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ హోటల్‌లో 36 ఏళ్ల మహిళ హత్య చేయబడింది. మహిళ హత్య ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. నిందితుడైన యువకుడు మహిళను గొంతు కోసి చంపినట్లు సమాచారం. ఈ కేసులో మృతురాలు ఇమ్రానాగా పోలీసులు గుర్తించారు. ఆ మహిళ ఆగ్రాకు చెందినదని పోలీసులు చెబుతున్నారు.
 
ఆమె రాజీవ్ నగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివశిస్తోంది. హత్య జరిగిన రోజున మృతురాలు తన బాయ్‌ఫ్రెండుతో కలిసి హోటల్‌లోని ఒక గదికి వచ్చింది. అంకిత్ పేరుతో మహిళను అతడు ఇక్కడ హోటల్‌కు తీసుకువచ్చాడు. గదిలోకి కొంతసేపు గడిపిన తర్వాత మహిళను సదరు యువకుడు రాత్రి 9.15 గంటల సమయంలో కత్తితో పొడిచాడు. ఆమె అతడి నుంచి తప్పించుకునేందుకు మొదటి అంతస్తు నుండి కింది అంతస్తుకు పడిపోయింది. ఆమె పడిపోయిన తర్వాత హోటల్ సిబ్బంది ఆమెను గమనించి వెంటే పోలీసులకి తెలియజేసారు.
 
మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు. హత్య కేసుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే మహిళ మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు బయటపడిందని పోలీసులు తెలిపారు. నిందితుడైన యువకుడిపై కేసు నమోదు చేసి అతని కోసం వెతుకుతున్నారు.