గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (19:38 IST)

మగబిడ్డను కనలేదనీ... సలసల కాగే నీళ్ళు భార్యపై పోసిన భర్త

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో మరో దారుణం జరిగింది. ముగ్గురూ ఆడబిడ్డలే పుట్టారన్న అక్కసుతో పాటు మగబిడ్డను కనలేదన్న అక్కసుతో భార్యపై సలసలకాగే వేడి నీళ్లను కసాయి భర్త గుమ్మరించాడు. దీంతో ఆ మహిళ శరీరంతా నీరు బొబ్బలు వచ్చాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌ అనే వ్యక్తికి 2013లో సంజు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి రూ.50 వేలు అదనపు కట్నం తేవాలంటూ భార్యను భర్త వేధించసాగాడు. 
 
ఇటీవల ఆమెకు భోజనం కూడా పెట్టడం మానేశాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 13 ఇంట్లో ఉన్న భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఆవేశంలో వేడినీళ్లు పోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.