గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (17:34 IST)

ఎవడు భరిస్తాడండీ బాబూ.. భర్తను మంచానికి కట్టేసి కరెంట్ షాకిచ్చింది..!?

current shock
భర్త హింసలు పెడితే భరించే భార్యలు కనుమరుగవుతున్నారు. ప్రస్తుతం సీన్ మారింది. భర్త పెట్టే హింసలు తట్టులేక పోతున్న మహిళలు వారికి బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా చిత్రహింసలు పెడుతున్న భర్తకు కరెంట్ షాక్ పెట్టిన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ బికనీర్‌కు చెందిన మహెంద్రన్ అనే వ్యక్తి తన భార్యతో తరచు ఘర్షణ దిగుతుండడం, అనుమానాలు పెట్టుకోవడంతోపాటు దుర్భాషాలడడడం వంటివి ఆయన భార్య తట్టుకోలేక పోయింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు బుద్ది చెప్పేందుకు ప్లాన్ వేసింది. ఇంటికి వచ్చిన భర్తతో స్వీట్‌గా మాట్లాడి మత్తు మందు కలిపిన భోజనం పెట్టింది. అనంతరం నిద్రలోకి జారుకున్నాక కాళ్లను మంచానికి కట్టేసింది. అనంతరం రెండు కాళ్లకు కరెంటు షాక్ పెట్టింది.
 
దీంతో మెలకువ వచ్చి, అరిచినా కూడా భర్తను వదిలిపెట్టలేదు..అలా రెండు రోజుల పాటు కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలకు గురి చేసింది...అనంతరం రెండు కాళ్లు కాలిపోయిన తర్వాత ఆమె కోపం చల్లారింది.. ఆ తర్వాత భర్త సోదరునికి ఫోన్ చేసి మహేంద్రన్‌‌కు కరెంట్ షాక్ తగిలిందని కూల్‌గా చెప్పింది. 
 
దీంతో కుటుంభ సభ్యులు వచ్చి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మహేంద్రన్ ఆసుపత్రి నుండి సృహలోకి వచ్చిన తర్వాత అసలు విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.