గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (16:56 IST)

బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని రోడ్డుపై నటి రచ్చ.. రోడ్డుపై దేశీ స్పైడర్ డ్రెస్‌తో..?

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాష ఏదైనా సరే.. బిగ్‌బాస్‌ షో మొదలైందంటే చాలు.. టీఆర్పీ రేటింగ్స్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోతాయి. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతుంది. అందుకే ఈ బిగ్‌ రియాల్టీ షోకి భారత్‌లో ఎనలేని క్రేజ్‌ ఉంది.
 
హీరో, హీరోయిన్ల నుంచి మొదలు.. సోషల్‌ మీడియా సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. తాజాగా వివాదాస్పద నటి రాఖీ సావంత్‌ తనను బిగ్ బాస్ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మంగళవారం ఉదయం స్పెడర్‌ ఉమెన్‌ గెటప్‌ వేసి, ముంబై వీధుల్లో తిరుగుతూ హల్‌ చల్‌ చేసింది. అభిమానులతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసింది.
 
తాను రాఖీని కాదని.. స్పైడర్-ఉమెన్ అని అంటూ వినోదాత్మక చేష్టలతో అభిమానులను అలరించింది. తనకు బిగ్‌బాస్‌ షో అంటే చాలా ఇష్టమని చెబుతూ.. ఓటీటీ సీజన్‌లోకి తనను ఆహ్వానించకపోవడం బాధగా ఉందంటూ ఓ వీడియోని షేర్‌ చేసింది.
 
సిద్ధార్థ్ శుక్లా.. షెహ్నాజ్ గిల్ లను ఆహ్వానించి.. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం రాఖీ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వోట్‌ జరుగుతుండగా.. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.