గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 14 ఆగస్టు 2021 (18:11 IST)

పిల్లలు పుట్టిస్తా అంటూ మూడు రాత్రులు వివాహితపై అత్యాచారం చేసిన మంత్రగాడు

ప్రేమించిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది. అయితే పిల్లలు పుట్టలేదు. 8 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో భర్త ఒక స్వామీజి దగ్గరకు తీసుకెళ్ళాడు. అయితే ఆ స్వామీజీ మంత్రాలంటూ ఆమెను మూడురోజుల పాటు లొంగదీసుకున్నాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో రెహమాన్, రేష్మాలు నివాసముంటున్నారు. వీరికి 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వీరు వివాహం చేసుకున్నారు. అయితే పిల్లలు పుట్టకపోవడంతో ఇంట్లోని పెద్దవారు సూటిపోటి మాటలను అనేవారు.
 
దీంతో మనస్థాపంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ అనే మాంత్రికుడి దగ్గరకు వెళ్ళారు. వారంరోజుల పాటు పూజలు చేసి మంత్రాన్ని జపిస్తే పిల్లలు పుడతారని చెప్పాడు మంత్రగాడు. నిజమేనని నమ్మిన వారిద్దరు పూజలు చేశారు. కానీ పూజ సమయంలో మత్తు మందు ఇచ్చి మూడురోజుల పాటు రేష్మాపై అత్యాచారం చేశాడు ఇంతియాజ్. 
 
అయితే ఆలస్యంగా విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు తన భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో స్వామీజీని స్థానికులతో కలిసి చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడు గతంలో ఇదేవిధంగా చాలామంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు.