శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 5 ఆగస్టు 2021 (20:42 IST)

దారుణం, భార్యపై కజిన్ అత్యాచారం, వీడియో తీసిన భర్త

మధ్యప్రదేశ్‌లోని గుంగాలో దారుణం జరిగింది. వివాహితపై ఆమె కజిన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని వీడియో తీశాడు పైశాచిక ప్రవర్తన కలిగిన శాడిస్ట్ భర్త. ఈ అసభ్యకరమైన చర్యను అతడు చిత్రీకరించాడు.
 
ఆమె భర్తకి మూఢ విశ్వాసాలు ఎక్కువ. దీనితో 21 ఏళ్ల మహిళ క్షుద్ర అభ్యాసకుడిని కలుసుకుందామంటూ చెప్పి తన అత్త ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఇంట్లో మహిళను గది లోపల బంధించి, ఆమె కజిన్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు చెప్పగా ఆమె అత్తమామలు బెదిరించారు. దానితో ఆ మహిళ తన తల్లిదండ్రులను సంప్రదించి సంఘటన గురించి తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.