ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (15:03 IST)

ట్రైనీ మహిళా ఎస్ఐపై అత్యాచారం? ఎస్సై శ్రీనివాస‌రెడ్డి రిమాండ్

ట్రైనీ మహిళా ఎస్ఐని వేధింపులకు గురిచేసిన కేసులో మ‌రిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించారు. వ‌రంగ‌ల్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి బాధిత ట్రైనీ మహిళా ఎస్ఐ వరంగల్ సిపి తరుణ్ జోషీకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఈ ఘటన జిల్లాతోపాటు రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెండ్ చేసిన సిపి తరుణ్ జోషీ, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్ పిని ఆదేశించారు. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు.