ఆదివారం, 5 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Last Updated : శనివారం, 4 అక్టోబరు 2025 (11:31 IST)

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

Balakrishna's Akhanda 2:
Balakrishna's Akhanda 2:
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ సీక్వెల్ అఖండ 2: తాండవం. అఖండకు మించి ఆదరణ పొందుతుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలు, కథానాయకుడు వున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
 
చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.  ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్‌ భారీ బజ్ క్రియేట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ సీక్వెల్ ఒక గ్రేట్ సినిమాటిక్  ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. బోయపాటి శ్రీను బిగ్గెస్ట్ కాన్వాస్‌పై లార్జర్ దెన్ లైఫ్ మూవీ రూపొందిస్తున్నారు.
 
రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో బాలకృష్ణ లాంగ్‌ హెయిర్‌, రగ్గడ్‌ బీర్డ్‌తో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. మెడ నిండా పవిత్ర మాలలు, ఆభరణాలు, చేతిలో భారీ త్రిశూలం,  కాషాయం, గోధుమరంగు సంప్రదాయ దుస్తులు ఆయన లుక్‌కి మైథాలజికల్‌, డివైన్ వైబ్ జోడించాయి. మంచుతో నిండిన ప్రకాశవంతమైన బ్యాక్‌డ్రాప్‌లో కనిపించిన లుక్ అదిరిపోయింది.
 
ఎస్‌. థమన్‌ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ సినిమాకి హై వోల్టేజ్‌ ఎనర్జీ అందించబోతోంది. అభిమానులు, మాస్‌ ఆడియెన్స్‌ బాలయ్య డివైన్ ఫెరోషియస్  అవతార్‌ కట్టిపడేసింది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
కాగా, ఈ సినిమాలో వున్న అంచనాలు మామూలుగా లేవు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలల్లో పరిస్థితులు వల్ల ఓ వర్గం ఈ సినిమాను ఎంకరేజ్ చేస్తుందా? అనే అనుమాలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు కూడా అసెంబ్లీలో కొంతమంది శాసనసభ్యులు అనవసరమైన విషయాను ముందుకు తెస్తున్నారని గట్టిగా మందలించారు. ఏది ఏమైనా ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు అనేవి అవినాభావ సంబంధాలున్నవి. హీరోలు ఏ పొరపాటు చేసినా వారి సినిమాలపై ప్రబావం చూపుతాయని పలు సందర్భాల్లో నిరూపించాయి. 
 
ఇక ఈ సినిమాకు సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.