నటీనటులు : ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, దివ్య దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శత్రు తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : సురేష్ రగుటు, జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం : శక్తికాంత్ కార్తిక్, నిర్మాతలు : జయ్ కృష్ణ, లింగమనేని, శ్రీ హర్ష, దర్శకత్వం : దేవా కట్టా, కిరణ్ జేయ్ కుమార్.
ఈమధ్య ఓటీటీ లో రాజకీయ నేపథ్య కథలు వస్తున్నాయి. మారుమూల దాగి వున్న కథలను మరోసారి గుర్తుచేసుకునేలా వుంటున్నాయి. దర్శకుడు దేవా కట్టా ఆవిష్కరించిన మయసభ విలేజ్ పొలిటికల్ నేపథ్యంతో రూపొందింది. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఆంధ్రప్రదేశ్‌లోని పులిచర్లకు చెందిన ఇద్దరు విద్యావంతులు కాలేజీ రోజుల్లో స్నేహితులు. వేరువేరు కులాలు. కాకర్ల కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామి రెడ్డి ల జీవితకథే ఈ మయసభ వెబ్ సిరీస్. కాలేజీ అనంతరం ఊరిలోజరిగిన సంఘటనల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకుంటారు. దానికి దారితీసిన పరిస్థితులు ఒకరిని మంచివాడిగా, మరొకరిని చెడ్డవాడిగా కనిపిస్తాయి. ఈ ఇద్దరూ రాజకీయాల్లో కీలక నాయకులుగా ఎదుగుతారు. అయితే, కొన్ని కారణాల వల్ల వారిద్దరి దారులు వేరవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అనేవి మిగిలిన కథ.
సమీక్ష:
సహజంగా రాజకీయ నేపథ్యం, గ్రామీణ రాజకీయాలు, హత్యలు, కుట్రలు, కులం అనేవి చాలా సినిమాలు వచ్చాయి. దానితో కంటెంట్ కూడా చాలా చోట్ల మనం చూసినవే, మా ఊరిలో జరిగిందే అనేట్లుగా వుంటుంది. అందుకు కారణం సహజంగా దర్శకుడు సన్నివేశాలు రాసుకోవడం, కులం పెద్ద పీఠవేయడం వంటివి కనిపిస్తాయి. ఇక ఆది పినిశెట్టిపాత్రలో రామ్ చరణ్ నటించిన రంగస్థలంలోని పాత్ర స్పురిస్తుంది. అయితే కొన్ని చోట్ల సజావుగా, కొన్నిచోట్ల నత్తిగా మాట్లాడుతుంటాడు.
ఈ కథలోని మలుపులు, ద్రోహం, లక్ష్యం, త్యాగం తదితర అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. నచ్చినా నచ్చకపోయినా రాజకీయాలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. దేవా కట్టా ఈ అంశాన్ని చక్కగా అవలంబిచుకుని, ఆసక్తికర పొలిటికల్ డ్రామాను తీర్చిదిద్దారు. రికార్డింగ్ డాన్స్ కూడా సహజంగా చూపించారు. ఓ రాజకీయ కథను చెప్పడంలో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విషయంలో దర్శకులు మంచి మార్క్ చూపెట్టారు. రామి రెడ్డిగా చైతన్య రావు, కృష్ణమనాయుడు గా ఆది పినిశెట్టి పర్ఫెక్ట్‌గా సరిపోయారు. సాయి కుమార్, చక్రధర రావు కూడా తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు.
మేడమ్ అనే పాత్రలో దివ్య దత్తా సూటయింది. సిరీస్‌లోని పాత్రలకు మరింత డెప్త్ తీసుకురావడంలో ఆమె పాత్ర తోడ్పడింది. నాజర్ మీడియా లెజెండ్ శివాజీ రావు పాత్రలో, చేవెళ్ల బాబు రావు పాత్రలో శ్రీకాంత్ భరత్, పోతినేని రమేష్ అనే నక్సలైట్ పాత్రలో రవీంద్ర విజయ్, నటి అను హారిక పాత్రలో తాన్య రవిచంద్రన్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు
అయితే, రాజకీయ కథ అనగానే కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. మొదట,ఎండింగ్ లో బాగా డీల్ చేసిన దర్శకుడు మధ్యలో కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా కనిపిస్తాయి. భారత్‌లో ఎమర్జెన్సీ వంటి సన్నివేశాలు ఎఫెక్ట్ కనిపించదు. సహజంగా ఇటువంటి కథలను కల్పితంగా తీసుకోవడం మామూలే. అయినా సరే ఎక్కడో చోట ఇందులోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు కొందరికి కనెక్ట్ అవుతాయి కూడా. వెబ్ సిరీస్ కున్న ఫ్రీడమ్ ను ఇందులో దర్శకుడు ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. ఇందులో కొన్ని హింసాత్మక సన్నివేశాలు, కొన్ని బోల్డ్ డైలాగులు వల్ల ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బందిగా వుంటుంది.
సాంకేతికపరంగా చూస్తే, దేవా కట్టా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఎవరికీ పక్షపాతం చూపకుండా అన్ని పాత్రలను బాగా డీల్ చేశారు. అయితే, కొంచెం మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. సురేష్ రగుటు, జ్ఞానశేఖర్ విఎస్ కెమెరా బాగుంది. ఆర్ట్ డిజైన్ వర్క్ బాగుంది. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చాలా వరకు బాగున్నా,సన్నివేశపరంగా వచ్చే శక్తికాంత్ కార్తిక్ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇందులో నటించిన అన్ని పాత్రలకు మంచి పేరు తీసుకువచ్చిందనే చెప్పాలి. కొన్నిచోట్ల సన్నివేశాలు సాదాసీదాగా వున్నాయి. రాజకీయ కథలు నచ్చేవారికి ఇది థ్రిల్ కలిగిస్తుంది.
రేటింగ్ : 3/5