ఆదివారం, 10 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2025 (13:56 IST)

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

Balakrishna, Boyapati Srinu
అఖండ 2 సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో బాగంగా నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ ఫొటోలను షేర్ చేసింది. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. తాండవం మీ ఊహకు అందనంత భారీగా ఉండబోతోందంటూ దర్శకుడు తెలియజేస్తున్నారు. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు 25న గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీగా ఉంది.
 
కాగా, ఈ సినిమాలోని మిగతా పాత్రధారులు డబ్బింగ్ వర్క్ సైతం మొదలు అయింది. మరో వైపు రీ రికార్డింగ్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ - సీజీ పనులు జరుగుతున్నాయని వివరించారు.‌ ఆగస్టు నెలాఖరుకు సినిమా పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఇందులో సంయుక్త హీరోయిన్ బాలకృష్ణతో నటిస్తున్న తొలి చిత్రమిది. హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ కళా దర్శకుడు. తమ్మిరాజు ఎడిటర్. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేశారు. సి రాంప్రసాద్, సంతోష్ డీటకే సినిమాటోగ్రఫీ అందించారు.