శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2025 (22:48 IST)

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

Roja_Narayana
Roja_Narayana
శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారిని చాలామంది సెలెబ్రిటీలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట ఆసక్తికర దృశ్యం కనిపించింది. వైసీపీ నేత రోజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరులు తిరుమల విచ్చేశారు. ఈ నేపథ్యంలో రోజా, నారాయణ ఒకరికొకరు ఎదురుపడ్డారు. 
 
రోజాను చూసి నారాయణ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఆపై రోజాకు నారాయణ తన ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను పరిచయం చేశారు. అందరూ కలిసి ఫోటోకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.