శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2025 (07:45 IST)

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Rashmika Mandanna, Dixit Shetty
Rashmika Mandanna, Dixit Shetty
నటీనటులు: రష్మిక, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, అను 
సాంకేతికత: దర్శకుడు:రాహుల్ రవీంద్రన్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాతలు, ధీరజ్ మొగిలినేని, సంగీతం: అబ్దుల్.
 
 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అనేది టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన భూమాదేవి కథే ఈ చిత్రం తనని తానుగా స్వీకరించని బంధం నుంచి.. ఆ బంధీఖానా నుంచి ఆ యువతి ఎలా బయటపడిందాని పర్యావసనాలు అనేవి తాను కాలేజీ హాస్టల్ లో వుండే రోజుల్లో జరిగిన కథగా దర్శకుడు రాసుకున్నాడు. కరోనా టైంలో ఓటీటీ కోసం రాసుకుంటే థియేట్రికల్ కథ అని అల్లు అరవింద్ అప్పటినుంచి ఆపి ఎట్టకేలకు 2025, నవంబర్ 7న విడుదల చేయించారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ 
భూమా దేవి (రష్మిక) తల్లిలేని అమ్మాయి. తండ్రి పెంపకంలో పెరుగుతుంది. ఆమె పై చదువుకోసం సిటీకి పంపి పి.జి. ఇంగ్లీష్ కోర్సును చదివిస్తుంటాడు. తల్లి లేకపోవడంతో తండ్రి పెంచిన గారాబంతోపాటు అమాయకత్వం, ఏదీ ధైర్యంగా చెప్పలేని తనం ఆమె లక్షణాలు.  సిటీలో రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎంఏ లిటరేచర్ జాయిన్ అవుతుంది. అక్కడ భూమాదేవి  చదువు తప్ప వేరే ధ్యాస వుండదు. కానీ అనుకోని స్థితిలో అక్కడే చదివే విక్రమ్ (దీక్షిత్ శెట్టి) చెప్పే మాటలకు పొగడ్తలకు పడిపోయి లిప్ కిస్ నుంచి హాస్టల్ లో బెడ్ ను షేర్ చేసుకకునే స్థాయికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల భూమాకు విక్రమ్ లో అహంకారం, అనుమానం, హింసాత్మక ప్రవర్తన వుందని తెలిసినా గట్టిగా చెప్పలేని స్థితి. అలాంటి అమ్మాయి చివరికి ఏమి చేసింది? అనేది సినిమా.
 
సమీక్ష:
ఈ కథలోని భూమా పాత్రకు ఆ తరహా యువతులు కనెక్ట్ అవుతారు. ఇప్పటి యువతులు చాలా ఫాస్ట్ గా వున్నారనేది తెలిసింది. కానీ ఇంకా చాలా చోట్ల అమాయకత్వం, సమాజంలో ఎలాంటి వ్యక్తులు వుంటున్నారనేది తెలుసుకునే లోపల వారి జీవితంలో జరగానిది జరిగిపోతుంది. అలాంటి అమ్మాయికి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఆ దశలో ప్రేక్షకుడికి కాస్త పరీక్షలా అనిపిస్తుంది. ఆర్ట్ ఫిలింలా కథనం సాగుతుంది. 
 
నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుందని, నువ్వు చాలా అందంగా వుంటానే మాటలకు పడిపోయిన అమ్మాయిగా రష్మిక నటించింది.  ఈ కోణంలో దర్శకుడు రాసుకున్న కథకు ఇంటర్ వెల్ బ్లాక్ లో మంచి ట్విస్ట్ వుంది. తన బాయ్ ఫ్రెండ్ తో వాళ్ళ ఊరు బెంగుళూరు వెళ్ళాక అక్కడ వాళ్ళ అమ్మ ప్రవర్తన చూశాక తన జీవితం కూడా ఇలానే వుంటుందా? అనే విధంగా చూపించాడు. కానీ ఆ తర్వాత తిరిగి వచ్చాక భూమా పడే స్ట్రగుల్ వున్నా మరలా వెంటనే విక్రమ్ ను యాక్సప్ట్ చేయడం జరిగిపోతాయి. ఇలా తాను తాను దేనికోసం కాలేజీకి వచ్చిందో.. తన జీవితం ఏమిటో కూడా తెలిసినా విక్రమ్ ప్రవర్తను ఎదిరించలేని స్థిలో వుంటుంది. ఈ పాత్రను ఆమె బాగా పోషించింది.
 
చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో అభిరుచి గల దర్శకుడనిపించుకున్న రాహుల్ రవీంద్రన్.. ప్రేమకథల్లో ఓ కొత్త కోణం చూపించాలనే ప్రయత్నంలో చేసిన సినిమా ఇది.  కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమ కథలో వుమెన్ సెంట్రిక్ అంశాన్ని జోడించి.. ప్రేక్షకులు ఈ కథకు రిలేట్ అయ్యేట్టు చేశారు. అయితే విక్రమ్ నీకు తగినవాడు కాదు. అతనికి నేనూ ప్రపోజ్ చేశాను. అంటూ రష్మిక స్నేహితురాలు అను చెప్పినా ఆమె బయటపడలేకపోతుంది. 
 
- లేడీస్ హాస్టల్ కు విక్రమ్ రావడం ఆమె రూమ్ లోనూ రాత్రుళ్ళు వుండడం అనేవి ప్రతి ఒక్కిరీకీ తెలుస్తుంది. కానీ కాలేజీ ప్రొఫెసర్ కూ, యాజమాన్యానికి తెలియదు. తండ్రి షడెన్ గా వచ్చాక విక్రమ్ ను రూమ్ లో  చూసి కొడితే తిరిగి అతను ఎదురుతిరిగే విధానం, విక్రమ్ లోని శాడిజిం బయట పడినా భూమా తేలిగ్గా తీసుకోవడం ఇప్పటి యువతకు చికాకు పుట్టిస్తుంది. 
 
- నాలుగు గోడల మధ్య లిప్ కిస్ పెడితే దాన్ని కాలేజీ అంతా ప్రచారం చేసినప్పుడైనా భూమా పాత్ర మారదు. నువ్వు లక్కీ. కాలేజీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బాయ్ ఫ్రెండ్ ను సంపాదించామనే స్నేహితుల మాటలకు పొంగిపోతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగినా మారడానికి ధైర్యం చాలదు. తనకు జరుగుతున్న అన్యాయానికి తనే బాధ్యురాలిగా బాధను అనుభవిస్తుంది తప్పిదే ధైర్యంగా మాట్లాడలేదు. 
 
- ఇక ఫ్రొఫెసర్ పాత్ర ద్వారా మోటివేటివ్ గా  నీ లైప్ నీది. మీ నాన్నది కానీ రేపు వచ్చేవాడిది కాదని చెప్పాక కూడా సీక్రెట్ గా రూమ్ లోకి వెళ్ళి విక్రమ్ కు బ్రేకప్ చెబుతుంది. అంతకుముందు ఓసారి చెప్పినా మరలా అతని స్పర్శకు దగ్గరవుతుంది. అయితే ఈసారి పెండ్లి చేసుకుందాం. మా అమ్మకు తోడుగా వుండు. ఇక చదువు ఆపేయ్ అన్నాక.. ఆమెలో చైతన్యం వచ్చినట్లు కనిపించినా ఎదిరించలేకపోతుంది. ఫైనల్ గా ప్రేక్షకుడితే చికాకు పుడుతుంది. 
 
- ఆ టైంలో తండ్రికి ఫోన్ చేయడం.. నువ్వు ఇలా ఆపుకోలేవని చెబితే ఎప్పుడే పెండ్లిచేసేవాడిని గదా. మీ అమ్మకంటే నువ్వు చచ్చిపోయేబాగుండేది.. అంటూ పరుషమైన డైలాగ్స్ చెప్పడంతో ఒక్కసారిగా ఆమెలో అమ్మవారు పూనినట్లు ఫీలయి కాలేజీ వీడ్కోలు రోజు భారీ డైలాగ్ చెబుతుంది. ఈ డైలాగ్ కోసం చివరికి వరకు ప్రేక్షకుడు ఓపిగ్గా కూర్చోవాలి.
 
ఇలాంటి ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చెప్పడం.. చెప్పి పాత్రల్ని ఒప్పించడం పెద్ద టాస్క్. అందుకే అల్లు అరవింద్ కూడా.. ఈ సినిమా ఏమేరకు ఆడుతుందో చెప్పలేను. రేటింగ్ కూడా ఒకటిన్నర ఇస్తారేమో అంటూ నాకు త్రుప్తి ఇచ్చిన సినిమా అంటూ వెల్లడించారు. తనకు కూతురు లేదనీ ఆ లోటు రష్మికను చూశాక ఆమెలో చూసుకుంటున్నానని చాలా సార్లు చెప్పాడు. అందుకే ఆమెతో సినిమా తీశానని కూడా అన్నాడు. 
 
- అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా అసలు నా కథ ఇప్పడు మొదలైంది అంటూ ఓ వ్యక్తి పలుకరింపుతో రష్మిక చెబుతుంది. ఆ పిలుపు ఎవరిది? తర్వాత ఆమె ఏం చెప్పదలచుకుంది? అనేది  వుందేమో అనేలా దర్శకుడు ట్విస్ట్ ఇచ్చాడు. కానీ ఈ సినిమా ఆడితే సీక్వెల్ వుంటుందేమో చూడాలి.
  ప్రేమకథను చూపించారు రాహుల్ రవీంద్రన్. కథ, కథనం, మాటలు అతనే కావడంతో చాలా నీట్‌గా ప్రజెంట్ చేశారు. తాను రాసుకున్న కథకి బలమైన పాత్రల్ని ఎంచుకోవడంతో పాటు.. ఆ కథని ఎలా చెప్తే ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందో దర్శకుడు లెక్క తప్పలేదు
 
నువ్వు ఎవరికి భయపడుతున్నావో తెలియదు కానీ.. అలవాటు చేసుకోకు.. అంటూ హీరోయిన్ పాత్రతో ప్రొఫెసర్ రాహుల్ మాటలకు రియలైజ్ అయినట్లు కనిపిస్తుంది. అందుకే ఇప్పటి చదువులు సుద్ద దండగ. చిన్నతనం నుంచి సరైన విద్యావిధానం వుంటేనే మహిళలు ఆలోచనలు బాగుంటాయి. ధైర్యంగా వుంటారు. ఇవి లేకుండా బానిస చదువులు చదివితే భూమా లాంటి పాత్రలే దేశంలో ఎక్కువగా వుంటాయి. విక్రమ్ పాత్రలు వారిపై పెత్తనం చేస్తారు. ఈ పాయింట్ నుకూడా హైలైట్ చేస్తే సినిమా మరో లెవల్ లో వుండేది.
 
ఇక టెక్నికల్ గా బీజియమ్స్ హేషమ్ అబ్దుల్ వహాబ్ బాగా డీల్ చేశాడు. సినిమా టోగ్రపీ బాగుంది. చిన్న పాయింట్ ను రెండు గంటలు పైగా లాగి చూపించాడు దర్శకుడు. అల్లు అరవింద్  సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడిలను నిర్మాతలుగా పెట్టారు. ఖర్చుకి వెనకాడకుండా మంచి ఔట్ పుట్‌ని అందించారు.
 రేటింగ్: 2.5/5