శుక్రవారం, 24 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2025 (16:47 IST)

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ పై స్పెషల్ సాంగ్

Balakrishna, Samyukta Menon
Balakrishna, Samyukta Menon
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ 2 తాండవం. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. సనాతన దర్మం గురించి తనదైన శైలిలో దర్శకుడు చెబుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకోవచ్చింది. కాగా, ఈ సినిమా కోసం ప్రత్యేక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుగుతోంది.
 
గతంలో కల్కి చిత్రాన్ని షూట్ చేసిన ఒన్ స్టూడియోలో వేసిన సెట్లో అఖండ 2 సాంగ్ జరుగుతోంది. బాలకృష్ణ, సంయుక్త మీనన్ పై స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. మాస్ సాంగ్ గా రాబోతున్న ఈ పాటకు కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 250 మంది డాన్సర్లు ఇందులో పాల్గొన్నారు. ఈరోజు రేపు రెండు రోజులపాటు సాంగ్ పూర్తి చేయనున్నారు.
 
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ సంస్థ నిర్మాణం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అయ్యప్ప పి. శర్మ, శ్యామ్నా కశీమ్, హర్షాలీ మల్హోత్రా, ఝాన్సీ, కబీర్ దాస్ సింగ్, ఆది పినిశెట్టి, మురళీమోహన్, రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు.