మంగళవారం, 2 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2025 (16:59 IST)

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Nandamuri Tejaswini, Nandamuri Balakrishna, Brahmani
Nandamuri Tejaswini, Nandamuri Balakrishna, Brahmani
నందమూరి బాలక్రిష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న అఖండ 2 సినిమా గురించి నిర్మాత, బాలక్రిష్ణ కుమార్తె తేజస్విని గొప్ప స్టేట్ మెంట్ పోస్ట్ చేసింది. అఖండ 2 అనేది  సినిమా కాదు. ఫెస్టివల్ ఆఫ్ సినిమా అంటూ తెలియజేసింది. కథాపరంగా అందరినీ కట్టిపడేసే ఈ చిత్రంపై భారీ అంచనాలు ప్రేక్షకులు, అభిమానుల్లో వున్నాయి. అందుకే దీనిపై సాంకేతిక సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. రీరికార్డింగ్, వి.ఎఫ్.ఎక్స్ వంటి ఇతర టెక్నిల్ పరంగా అత్యున్నత స్థానంలో వుండాలనే పనిచేస్తున్నారు.
 
దానికోసం మనసుపెట్టి పనిచేస్తున్నారు. ఇది తెలుగు సినిమానే కాదు. అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాల్సిన సినిమా. అందుకే హై వాల్యూస్ తో సినిమా రూపొందించాం. కనుక మరింత మెరుగుదలతో సినిమా తీసుకు రాబోతున్నాం. అందుకోసం విడుదల తేదీని కూడా మరోసారి ప్రకటిస్తాం. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి వుంది అని తెలిపారు.