సంబంధిత వార్తలు
- Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్డేట్
- balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు
- Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ
- Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తిన బాలకృష్ణ (video)
- పులివెందులకు పూర్వవైభవం వచ్చింది : ఎమ్మెల్యే బాలకృష్ణ
అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు
వివిధ కారణాలతో ఇప్పటికే పలు చిత్రాలు వాయిదాపడుతున్నాయి. తాజాగా అఖండ-2 చిత్రం ఆ జాబితాలో చేరింది. ముందుగా ప్రకటించిన తేదీకి ఈ సినిమా విడుదల చేయడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారు. భారీ తరహాలో రూపొందిస్తున్న ఈ సినిమా రీరికార్డింగ్, వీఎఫ్ఎక్ సహా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలకు మరింత సమయం పడుతుందని అందుకే వాయిదా వేస్తున్నట్టు 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీ వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనివున్నాయి. గతంలో వచ్చిన అఖండకు స్వీక్వెల్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలాలగే, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబరు 25వ తేదీన విడుదలకానుంది. దీంతో దసరా పండుగకు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంటుందని సినీ ప్రియులు భావించారు. అయితే, ఈ రెండు చిత్రాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఓజీ టీమ్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. అనుకున్న తేదీకి చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండకు కొనసాగింపు కావడం, ఈ సారి హీరో పాత్ర అంతకుమించి ఉండటంతో అఖండ-2పైనా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
