శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (23:06 IST)

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్-రూ. 27,500 వరకు వేతనం

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. ఈ ఖాళీలు సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 
 
ఎంపికైన అభ్యర్థులకు మొదటగా నెలకు రూ. 27,500 వరకు వేతనం చెల్లించనున్నారు. రెగ్యులరైజ్ చేసిన అనంతరం రూ. 25 వేల నుంచి రూ.1.70 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.
 
మొత్తం 35 డిప్లొమో ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మూడేళ్ల డిప్లొమో కోర్సును గుర్తింపు పొంది టెక్నికల్ బోర్డు లేదా సంస్థ నుంచి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD, Ex-SM అభ్యర్థులు పాస్ మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు ఈ కింది స్ట్రీమ్‌లలో డిప్లొమో చేసి ఉండాలి.