డాట్ అదుర్స్.. 5జీ టెక్నాలజీ ట్రయల్స్ వేసుకోవచ్చు..
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) మంగళవారం టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతులు ఇచ్చింది. అయితే టెలికం కంపెనీలకు అనుమతులు జారీ చేయడంతో 5జీ టెక్నాలజీ ట్రయల్స్ ఇక వెయ్యచ్చు.
ఈ 5జీ ట్రయల్స్ కోసం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జయో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి డాట్ అనుమతులు కూడా జారీ చేసింది. అయితే ఈ కంపెనీలు ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ టెక్నాలజీ ప్రొవైడర్లతో పార్ట్నర్ షిప్ పెట్టి ఈ ట్రయల్స్ నిర్వహిస్తాయి.
ఇది ఇలా ఉండగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం కంపెనీలు ఎరిక్‌సన్, నోకియా, శాంసంగ్, సీడాట్ వంటి సంస్థలతో పార్ట్నర్ షిప్స్ స్టార్ట్ చేసాయి. అయితే ఈ 5జీ ట్రయల్స్‌కు కేంద్రం ఆరు నెలల గడువు ఇచ్చింది.
2 నెలల కాలంలో ఉపకరణాలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు, పాక్షిక పట్టణాలు, పట్టణ ప్రాంతాల్లో ఇలా అన్ని ప్రదేశాల్లోనూ 5జీ ట్రయల్స్‌ను నిర్వహించాలని కేంద్రం చెప్పడం జరిగింది. ఇవి సక్సెస్ అయితే డేటా స్పీడ్ పెరుగుతుంది. దీనితో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకి ప్లస్ అవుతుంది.