శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 మే 2021 (10:42 IST)

దేశంలో కరోనా విలయం.. 3,82,315 పాజిటివ్‌ కేసులు, 3,780 మంది మృతి

దేశంలో కరోనా విలయం కొనసాగుతుంది. గత మూడు రోజుల్లో కాస్త తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,82,315 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మరో 3,780 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు.
 
తాజాగా 3,83,439 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,06,65,148కు పెరగ్గా.. ఇప్పటి వరకు 1,69,51,731 మంది కోలుకున్నారు. మరో 2,26,188 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
 
ప్రస్తుతం దేశంలో 34,87,229 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 16,04,94,188 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. 
 
గత కొన్నిరోజులుగా కరోనా సునామీని చవిచూసిన దేశంలో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. మళ్లీ భారీగా పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.