గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (10:29 IST)

తెలంగాణాలో కొనసాగుతున్న కరోనా వైరస్ ఉధృతి

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 77,435 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6,361 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. 
 
కొత్తగా మహమ్మారి నుంచి 8,126 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 77,345 టెస్టులు నిర్వహించగా.. 6,361 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,69,722కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,09,491 మంది కోలుకున్నారు.
 
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 51 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజు 8,126 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,225 కేసులు నమోదయ్యాయి.