1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Maharashtra records 51,880 fresh COVID-19 cases, 891 deaths

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 891మంది మృతి

Maharashtra
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్‌ వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,41,910 యాక్టివ్‌ కేసులున్నాయి. 
 
ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 71,742కు చేరింది. మరోవైపు ముంబైలోనూ ఒక్క రోజే కొత్తగా 2,554 కేసులు నమోదయ్యాయి. మరో 62 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,41,910 క్రియాశీల కేసులు ఉన్నాయి. పుణెలో అత్యధికంగా 1,09,531 క్రియాశీల కేసులు ఉండగా.. నాగ్‌పూర్‌లో 64,554, ముంబయిలో 56,465, ఠానేలో 45516 చొప్పున ఉన్నాయి.
తర్వాతి కథనం
అమెరికన్ హాస్పిటల్‌లో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి