శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 మే 2021 (21:48 IST)

మోదీ సర్కారుకు ముందు చూపు లేదు.. రాజన్ పరోక్ష విమర్శలు

భారత్‌లో తొలివిడత కన్నా మలివిడత కరోనా విస్తరణ తీవ్రస్థాయిలో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ విమర్శించారు. మోదీ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే కరోనా విజృంభించేందుకు రఘురాం రాజన్ పరోక్ష విమర్శలు గుప్పించారు. 
 
ప్రస్తుత కరోనా కల్లోలానికి నాయకత్వ పటిమ, ముందుచూపు, సన్నద్ధత లోపించడమే కారణమని రఘురాం రాజన్ దుయ్యబట్టారు. కీలక వైద్య పరికరాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, హాస్పిటల్ బెడ్స్, మందులు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు సకాలంలో పట్టించుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
భారతీయ అధికారుల్లో కరోనా విషయమై ఏర్పడిన అనవసరమైన ధీమా కూడా కల్లోలానికి తోడైందని అన్నారు. పూర్తిగా కరోనా ముప్పు తొలగిపోలేదన్న సంగతి దృష్టిలో ఉంచుకోకపోవడం వల్ల సమస్య జటిలమైందని రఘురాం రాజన్ అభిప్రాయ పడ్డారు.