మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 మే 2021 (11:46 IST)

సింహాలను వదిలిపెట్టని కరోనా.. 8 సింహాలకు కోవిడ్ పాజిటివ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం జంతువులను కూడా వదిలిపెట్టట్లేదు. తాజగా హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా వచ్చింది. దేశంలో తొలిసారి జంతువులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెహ్రూ జూ పార్క్ లోని ఎనిమిది ఆసియా సింహాలకు పాజిటివ్ వచ్చింది. అయితే ఆ సింహాల్లో వైరస్ లక్షణాలు లేవంటున్న జూ నిర్వాహకులు చెబుతున్నారు.
 
సింహాల ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన ఎనిమిది సింహాలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇంతకీ కరోనా ఎవరి ద్వారా ఎలా సింహాలకు వ్యాపించి ఉంటుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకుతుందనడానికి కచ్చితమైన ఆధారాలేమి లేవు. ఈ పరిస్థితుల్లో సింహాలకు వైరస్ సోకడంతో అధికారులు వాటి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.