Megastar Chiranjeevi, Anil Ravipudi, Venkatesh
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది.
తాజాగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు.
#మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం! నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు .
మనం అందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం.
విక్టరీ వెంకటేష్ పోస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి రిప్లయ్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు.
మై డియర్ వెంకీ… మై బ్రదర్
మనిద్దరం కలిసి పనిచేసిన ఈ పది రోజులు నాకు మెమరబుల్. నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో, ఎనర్జీతో నిండిపోయింది. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రజెన్స్ అబ్బురపరిచింది. నీతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందం కలిగించింది.
విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి పోస్టులుని కోట్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి పోస్ట్ పెట్టారు.
కొన్ని కలలు మన మనసులో సంవత్సరాల పాటు దాగి ఉంటాయి. అకస్మాత్తుగా సినిమా అలాంటి కలలను నిజం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారితోపక్కపక్కన నిలబడి, కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, వారి ప్రత్యేకమైన చార్మ్‌తో మెరిసిన ఆ క్షణం…నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. నా ప్రయాణంలో ఇది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
#ManaShankaraVaraPrasadGaru కోసం తన పార్ట్ ని పూర్తిచేసి, ఈ అందమైన కలను సాకారం చేసిన డియర్ వెంకీ సర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని సంపాదించి ఎప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా