గురువారం, 13 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 13 నవంబరు 2025 (07:10 IST)

Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న

Rashmika Mandanna
Rashmika Mandanna
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి  జంటగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో  సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
 
హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ - స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ సినిమా తప్పకుండా చేయాలి, వీలైనంత త్వరగా చేయాలని అనుకున్నా. సినిమాలో నటిస్తున్నప్పుడు రాహుల్ ఒక వుమెన్ ఎమోషన్ ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నాడు అనిపించింది. భావోద్వేగంతో కొన్నిసార్లు షూటింగ్ కాసేపు ఆపేసేవాళ్లం. రాహుల్ ను కంప్లీట్ గా నమ్మి భూమా పాత్రలో నటించాను. 
 
భూమా లైఫ్ లో జరిగినవి కొన్ని నా లైఫ్ లోనూ చూశాను. నేనే తప్పు చేస్తున్నానేమో అనిపించేది. ఈ రోజు మా మూవీని థియేటర్స్ లో చూస్తూ చాలా మంది వుమెన్ రిలీఫ్ అయినట్లు, ఫ్రీడమ్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. మా సినిమాకు, ఈ సినిమా మేము చేయడం వెనక ఉన్న ఉద్దేశం ప్రేక్షకులు బాగా అర్థం చేసుకున్నారు. భూమా పాత్రకు మీరు కనెక్ట్ కావడమే, ఈ పాత్రపై మీరు చూపిస్తున్న అభిమానం అన్ని పురస్కారాల కంటే ఎక్కువ. ఈ సంతోషం ఒకవైపు ఉన్నా, మన సొసైటీలో ఇంతమంది అమ్మాయిలు భూమాలా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను మేము అనుకున్నట్లు చేసే ఫ్రీడమ్ ఇచ్చిన విద్య, ధీరజ్ గారికి థ్యాంక్స్. గీతా ఆర్ట్స్ మా వెనక అండగా ఉంది. డైరెక్టర్ రాహుల్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. దీక్షిత్ నటుడిగా ఒక జెమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్ భాగమయ్యారు. ఈ రోజు మా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో విజయ్ పాల్గొనడం హ్యాపీగా ఉంది. విజయ్ లాంటి పర్సన్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి. అన్నారు.