రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)
ప్రముఖ నటి రష్మిక మందన్నకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి అభిమానులు వున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో తన నటనతో ఆమె ఇటీవల సినీ ప్రేమికులను అలరించింది. ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో ఆమె చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా చూసి బయటకి వచ్చింది.
ఆ సమయంలో ఆమెతో ఫోటోలు తీసుకోవడానికి, ఆమెను చూడటానికి చాలా మంది ఎగబడ్డారు. ఇదంతా జరుగుతున్నప్పుడు, రష్మిక బౌన్సర్ ఓ మహిళా అభిమానిని తోసేయడానికి ప్రయత్నించింది. ఇది చూసిన రష్మిక బౌన్సర్‌ను ఆపి ఆమెతో సెల్ఫీ దిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పరిస్థితికి తగ్గట్టు రష్మిక స్పందించిందని నెటిజన్లు కితాబిస్తున్నారు. ఇంకా మహిళా అభిమానిని చూసి రష్మిక నవ్వుతూ, అభిమానితో ఫోటో దిగింది. దీంతో ఆ అభిమాని ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.
అలాగే గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన రష్మికను చూసి అక్కడి ఫ్యాన్స్ అందరూ రష్మక దేవరకొండ అంటూ పెద్దగా అరిచారు. వాళ్లు అలా పెద్దగా అరిచినా రష్మిక సంయమనం పాటించింది. పెద్దగా రియాక్ట్ కాకుండా స్మెల్‌తో పలకరించింది.