1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
  4. How to make almond and raagi malt recipe

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ragi badam malt recipe
బాదం, రాగి మాల్టులతో తయారు చేసుకునే పానీయం రుచిగా వుండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా శక్తినిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము.
 
మొదటగా రాగి పిండిని తీసుకుని దానిని బాణలిలో వేసి కొద్దిగా వేయించుకుని చల్లారనివ్వాలి.
ఆ తర్వాత బాదం పప్పులను పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు గిన్నెలో రాగి పిండి, బాదం పొడి, బెల్లం లేదంటే పంచదార అన్నింటినీ సరిపడినన్ని నీళ్లలో వేసి కలపాలి.
ఇలా తయారైన మిశ్రమాన్ని చిన్న సెగ మీద పెట్టి వుండలుగా కాకుండా కలియతిప్పుతూ ఉడికించాలి.
కొద్దిసేపటి తర్వాత మాల్ట్ చిక్కబడగానే అందులో పాలు పోసి ఓ 3 నిమిషాలు వుడికించాలి.
ఆ తర్వాత రుచి, సువాసన కోసం కొద్దిగా యాలుకలు పొడి వేసుకోవాలి.
ఈ బాదం, రాగి మాల్ట్‌ను చల్లార్చుకుని తాగేయవచ్చు
 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి