మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 18 ఆగస్టు 2021 (23:32 IST)

ఆ సమయంలో తప్ప మరెప్పుడు గర్భం రాదా?

సాధారణంగా రుతు స్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదలవుతుంది. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భధారణ జరుగుతుంది. వీర్యకణాలు, అండంతో కలసి పిండంగా మారుతాయి. దీనినే గర్భధారణ అని అంటారు.
 
ఈ సమయంలో తప్ప మరెపుడు గర్భధారణ కాదా? అనే ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కొందరిలో ముందుగా గర్భధారణ జరిగే అవకాశం ఉంది. ఇది చాలా తక్కువగా జరుగుతుంది. ఇలాంటి సంఘటనలలో 8 నుంచి 10 రోజుల లోపు అండం విడుదలవుతుంది. దీనిని ముందస్తు గర్భధారణ అంటారు. 
 
గర్భం ఎన్నాళ్ళుంటుంది ?
సాధారణంగా గర్భధారణ సమయం నుంచి ప్రసవించే వరకూ 40 వారాల (9 నెలల 10 రోజులు) కాలపరిమితిలో మహిళను గర్భవతి అంటారు. దీనిని మూడు దశలుగా విభజిస్తారు. మొదటి 12 వారాలను ఒకటోదశగానూ, 13-27 వారాలను రెండో దశగానూ, 28-40 వారాల కాలపరిమితిని మూడో దశగా పరిగణిస్తారు. 
 
పరీక్షలు చేయించుకోవాలా...? 
గర్భనిర్ధారణ అయిన తరువాత పరీక్షలు చేయించుకోవడం మంచిదే. రక్తహీనత, మూత్రపిండాలలో ఏవైనా లోపాలుంటే ఆ ప్రభావం పిండంపై పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో గర్భస్రావం జరగవచ్చు. కాబట్టి రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు చేయించుకుని వైద్యుల వద్ద సలహాలు తీసుకోవాలి. గర్భసంరక్షణకు వైద్యులను తరచూ సంప్రదిస్తూ ఉండాలి.