శనివారం, 23 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2025 (19:05 IST)

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

crime
ఓ వేశ్యకు ఆమెను బుక్‌ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. హయాత్‌నగర్‌కు చెందిన మధుగౌడ్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి కేపీహెచ్‌బీ పరిధిలోని రోడ్‌ నెంబర్‌-1కు వచ్చాడు. అక్కడ ఓ వేశ్యను బుక్ చేసుకున్నాడు. 
 
ఈ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఆ వేశ్య తన మరిది సోహైల్‌కు ఈ విషయం చెప్పింది. దీంతో సోహైల్ తన గ్యాంగ్‌తో కలిసి అక్కడికి వచ్చాడు. కత్తితో మధుగౌడ్‌పై దాడి చేశారు. 
 
ఈ దాడిలో మధు గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
అరెస్ట్ అయిన వారిలో రవళి, సోహైల్‌తో పాటు గూడెల్లి సాయికుమార్, బారెడ్డి శశిధర్‌రెడ్డి, బారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అశ్విని కుమార్ సింగ్, షేక్ షరీఫ్ ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.