బుధవారం, 20 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2025 (13:16 IST)

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

death
హైదరాబాద్ నగరం పాతబస్తీలోని బండ్లగూడలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్ తగిలి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపుతున్న క్రమంలో షాక్ తగిలి ప్రమాదం జరిగింది. 
 
మరోవైపు, అంబర్ పేట్‌లో రామ్ చరణ్ అనే యువకుడు ఇదేవిధంగా విగ్రహం తరలిస్తుండగా, అడ్డు వచ్చిన విద్యుత్ తీగలను తొలగిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురైన ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆదివారం రాత్రి రామాంతపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. రెండు రోజుల వ్యవధిలో మూడు విద్యుత్ షాక్‌ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో విగ్రహాలను తరలించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.