శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:37 IST)

తమిళనాడులో సెప్టెంబర్ 15 వరకు లాక్‌డౌన్‌

తమిళనాడులో ఆగస్టు 31వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది.వైరస్ వ్యాప్తి కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

5వ తేదీ నుంచి ఆదివారాల్లో అన్ని బీచ్‌లలో ఇకపై  విజిటర్ల ప్రవేశంపై నిషేధం విధించారు. వీకెండ్స్ మూడురోజులు (శుక్ర, శని, ఆది) అన్ని ప్రార్థనాలయాలు మూసివేసే ప్రక్రియను కొనసాగిస్తారు.
 
కేరళలో రోజుకు 30వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో తమిళనాడు-కేరళ సరిహద్దు ప్రాంతాలైన కోయంబత్తూరు, కన్యాకుమారీ, తెన్ కాశీ, తేనీ జిల్లాల్లోని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కేరళ నుంచి వచ్చే ప్రజలకు కరోనా పరీక్షలు చేసిన తర్వాతనే అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది