మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (08:48 IST)

సెప్టెంబర్ 2న ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయ్యాలి: మంత్రి ఎర్రబెల్లి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి,ఉద్యమాలే ఊపిరిగా సాగిందని, 2014 లో తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు రాష్ట్ర సీఎం కేసీఆర్ అని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలో దాదాపు 80 వేల సభ్యత్వాలు పైన చేసాము,అయినప్పటికీ గులాబిపార్టీని మరింత ప్రతిష్టంగా చేయుట కొరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కమిటీలను పూర్తి చేయాలనీ మంత్రి కోరారు. ఈ మేరకు సెప్టెంబర్ 2న ప్రతి గ్రామంలో జెండా పండుగ నిర్వహించాలని మంత్రి కోరారు.

ఈ నెల 12వ తేదీ వరకు గ్రామ,వార్డు మరియు అనుబంధ కమిటీల ఎన్నికలు పూర్తి చేసి, 13 నుండి 20వ తేదీ వరకు మండల మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కమిటీలను ఎన్నుకోవాలని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామస్థాయి  కమిటీలో 15 మంది సభ్యులతో కూడిన కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని కోరారు.

ప్రతి కమిటీలో ఎస్సి,ఎస్టీ,బిసి,మైనార్టీ వర్గాలకు పార్టీ నిబంధనల ప్రకారం 50% ఉండేలా చూడాలని మంత్రి కోరారు. గ్రామస్థాయితో పాటు వాటి అనుబంధ కమిటీలు అయినా రైతు, యువజన, మహిళా, సోషల్ మీడియా కమిటీలు కూడా పూర్తి చేయాలని మంత్రి అన్నారు.

కరోనా సమయం వలన గత కొద్దీ నెలలుగా కార్యకర్తలను కలవకపోవడం కొద్దిగా బాధగా ఉన్న కొద్దీ రోజులలోనే గ్రామాలలో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకోని తొలగించుకునేలా ప్రణాళిక చేసుకుందమని అన్నారు , అలాగే పార్టీ కార్యకర్తలకు కూడా ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ శ్రేణులకు తెలిపారు.