NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.
ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అదిరిపోయింది. నాలుగు రోజుల్లో పండుగ చేసుకోండి. ఈ సినిమాలో ట్విస్ట్ లు చాలా వున్నాయి. చూశాక తొందరపడి వాటిని బయట పెట్టకండి. డబుల్ కాలర్ ఎత్తిచూపిస్తున్నా. బొమ్మ అదిరిపోద్ది. ఇది హిందీ సినిమానే కాదు తెలుగు సినిమా కూడా.. అంటూ అబిమానుల ఆనందోత్సవాల మధ్య ఎన్.టి.ఆర్. తన స్పీచ్ ను ముగించారు. ఎన్.టి.ఆర్., రుతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో నిన్న రాత్రి జరిగింది.
ఎన్.టి.ఆర్. ప్రారంభోపన్యాసం సాగిస్తూ, 25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలి అనే సినిమాతో నా కెరీర్ ప్రారంభమైంది. దివంగత రామోజీరావు నన్ను అంగీకరించి సినిమా తీశారు. ఆ టైంలో నాన్న, అమ్మ తప్ప నా వెనుక ఎవరూ లేరు. ఏ జరుగుతుందో ఎలా వుండబోతుందో తెలీదు. ముజీబ్ అనే అభిమాని అక్కడ ఆధోని నుంచి వచ్చిన వ్యక్తి నా ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. నేను మీ ఫ్యాన్ అన్నాడు. నాకు అర్థంకాలేదు. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు అన్నా. మీరంటే చచ్చిపోయేంత అభిమానం అని చెప్పాడు.
అప్పటినుంచి ఎనలేని అభిమానులు రావడం పూర్వజన్మ సుక్రుతం అని నమ్ముతున్నా. దీనికంతటికి కారణం నాన్న హరిక్రిష్ణ, అమ్మలు షామిలీ, లక్మికి, మా అన్నగారు కళ్యాణ్ రామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి దర్శకుడికి పాదాభివందనం చేసుకుంటున్నా. ఎంతో మంది సపోర్ట్ తో అభిమానంతో ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి స్వర్గీయ నందమూరి తారక రామారారావు గారి ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు. అబయ్, భార్గవ్ కొడుకులకూ దీవిస్తున్నా. నా భార్యకు నమస్కరిస్తున్నా. నా తప్పులు, బాధల్లోనూ పంచుకున్న అభిమానుల రుణం తీర్చుకోలేను. నా జీవితం నాన్నగారికి అంకితం. ఈ జన్మకు ఇది చాలు. ఇంతకంటే ఏదీ అక్కర్లేదు. మిమ్మల్ని ఆనందించడానికే నా అడుగులు పడతాయి.
12 ఏళ్ళ నాడు బాద్ షా ఫంక్షన్ జరిగినప్పుడు ఓ అభిమాని తొక్కిసలాటలో ప్రాణం కోల్పోయాడు. అందుకేదూరంగా వు్నారు. అందుకే వంశీ ఫోర్స్ చేయడంతో ఈ పంక్షన్ ఏర్పాటు చేశాం. ఇక వార్ 2 సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం కథ, కథలోని బలం ఒకభాగమైతే నన్ను ఈ మూవీ చేయాలి అని వెంటబడి భరోసా కల్పించి నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆయన మాట నమ్మకుండా వుంటే ఇలా ధైర్యంగా మీ ముందుకు వచ్చేవాడిని కాదు. అలాగే రాజా ముఖర్జీ, వై.ఆర్.ఎఫ్. స్టూడియో అందరికీ థ్యాంక్స్.
నాకు ముంబై వెళ్ళి వుండడం ఇష్టం వుండదు. అయితే షూటింగ్ సమయంలో హైదరాబాాద్ లా అనిపించింది. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకూ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మాస్త్ర ఫంక్షన్ కు రావాల్సింది.కానీ అప్పుడు రాలేకపోయాడు. అప్పుడు అయాన్ కూడా రాలేకపోయాడు. విధి కల్పితం చూడడం. హైదరాబాద్ కు నా సినిమా దర్శకుడిగా వచ్చాడు. అయాన్ ముఖర్జీ ఓన్లీ ఆప్షన్ గ్రేటెస్ట్ ఫిలిమ్ దర్శకుడిగా నిలుస్తాడు. ఇద్దరు స్టార్స్, పెర్ ఫార్మర్స్ ను పెట్టుకుని చాలా కష్టపడి మాతో సినిమా చేశాడు. 2025 లో మరో బ్లాక్ బస్టర్ ఇండియాలో వార్ నిర్మాతగా అయాన్ కు దక్కుతుంది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా.
25 సంవత్సరాల కక్రితం కహోనా ప్యార్ హై సినిమా చూసినప్పుడు నాది, రితిక్ కెరీర్ ప్రారంభమైంది. అందులో ఆయన డాన్స్ చూశాక మైకేల్ జాక్సన్ తర్వాత అలాంటి డాన్సర్ అనిపించింది. నేను డాన్స్ కు మెస్మరైజ్ అయ్యాను. అది ఇప్పుడు వార్ 2 లో మరోసారి చూశా. ఇండియాలో ఫైనస్ట్ యాక్టర్ రుతిక్ రోషన్. డెడికేటెడ్ పర్సన్. రితిక్ రోషన్ గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆయన పక్కన డాన్స్ చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఇందులో కాంపిటేషన్ లేదు. బెస్ట్ అనుకోవడం. ఇందులో ఎవరు గెలిచారు? ఓడాడు? అనేది సోషల్ మీడియాలో వచ్చేది కరెక్ట్ కాదు.
నేను డాన్సర్. మనకంటే గొప్ప డాన్సర్ లు వుంటారు. వారిని గౌరవించాలి. ఆయన నన్ను ఆయనలో చూసుకున్నానని చెప్పారు. నేను కూడా ఆయన్ను నాలో చూసుకున్నాను. ఈ సందర్భంగా నేను సౌత్ వాడిని అయినా రాజమౌళి వల్లే బోర్డర్ చెరిగిపోయాయి. నన్ను మీ వాడిగా అంగీకరించినందుకు. ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఎన్.టి.ఆర్. ఈ సినిమాతో హిందీలో ఎంట్రీ అయినట్లే రుతిక్ కూడా తెలుగులో ఎంట్రీ అవుతున్న సినిమా.