కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి  
                                       
                  
				  				  
				   
                  				  ప్రముఖ నటి గౌతమి కపూర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరలై పెను దుమారానికి దారితీశాయి. తన కుమార్తెకు 16వ పుట్టిన రోజు సందర్భంగా సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని తాను ఒకపుడు ఆలోచించినట్టు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఎక్స్ వేదికగా వైరల్ అయింది. దీంతో ఈ చర్చ మొదలైంది. భారతీయ సమాజంలో తల్లిదండ్రులు పిల్లలతో లైంగిక అంశాలపై మాట్లాడటానికే సంకోచించే తరుణంలో, గౌతమి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ యేడాది మే నెలలో 'హాటర్' అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమి ఈ వ్యాఖ్యలు చేశారు. 
				  																												
									  
	 
	"నా కూతురికి 16 ఏళ్లు నిండినప్పుడు, నేను ఆమెకు ఒక సెక్స్ టాయ్ లేదా వైబ్రేటర్ బహుమతిగా ఇవ్వాలని ఆలోచించాను. ఈ విషయం తనతో చర్చిస్తే, 'అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా?' అని అడిగింది. ఎంతమంది తల్లులు తమ కూతుళ్లతో ఇలాంటి బహుమతుల గురించి మాట్లాడతారని నేను ఆమెకు చెప్పాను. ప్రయోగాలు ఎందుకు చేయకూడదు?" అని గౌతమి ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
				  
	 
	తన తల్లితో తనకు లేని స్వేచ్ఛ, స్నేహపూర్వక వాతావరణాన్ని తన కూతురికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా ఆలోచించానని ఆమె వివరించారు. "మా అమ్మ నాతో చేయనిది, నేను నా కూతురితో చేయాలనుకుంటున్నాను. ఆమె అన్ని విషయాలను అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది మహిళలు జీవితంలో సుఖాలను అనుభవించకుండానే గడిపేస్తారు. అలాంటి పరిస్థితి ఎందుకు? ఈ రోజు నా కూతురికి 19 ఏళ్లు. నేను అలా ఆలోచించినందుకు ఆమె నన్ను అభినందిస్తోంది, గౌరవిస్తోంది" అని గౌతమి తెలిపారు.
				  																																			
									  
	 
	మరోవైపు, ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఆమె ఆధునిక ఆలోచనా విధానాన్ని, కూతురితో స్నేహంగా ఉండే తత్వాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మైనర్‌గా ఉన్న కూతురికి అలాంటి బహుమతి గురించి ఆలోచించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు.