మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఆగస్టు 2025 (15:14 IST)

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

allu arjun
హీరో అల్లు అర్జున్‌కు విమానాశ్రయ భద్రతా సిబ్బంది చుక్కలు చూపించాడు. కళ్లద్దాలు, మాస్క్ తీసి ముఖం చూపించేంత వరకు ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ఇది ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అల్లు అర్జున్ శనివారం ముంబై ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ముఖానికి మాస్క్, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ ధరించి ఉండటంతో అక్కడి భద్రతా సిబ్బంది ఆయన్ను గుర్తుపట్టలేకపోయారు. సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్దకు రాగానే నిబంధనల ప్రకారం ఆయనను ఆపారు. వెంటనే అల్లు అర్జున్ అసిస్టెంట్ కల్పించుకుని ఆయన సినీ హీరో అల్లు అర్జున్ అని చెప్పే ప్రయత్నం చేశారు. 
 
అయితే, భద్రతా సిబ్బంది మాత్రం తమ విధి నిర్వహణకే కట్టుబడ్డారు. వ్యక్తి ఎవరైనా సరే నిబంధనల ప్రకారం ముఖాన్ని చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ తన మాస్క్, కళ్లజోడు తొలగించి ముఖం చూపించారు. ఆయన ముఖం చూసిన తర్వాత గుర్తుపట్టిన సిబ్బంది.. తనిఖీ ప్రక్రియను పూర్తి చేసి ఎయిర్‌పోర్టులోకి అల్లు అర్జున్‌ను అనుమతించారు.