శనివారం, 9 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 ఆగస్టు 2025 (16:01 IST)

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

Manchu Lakshmi- Allu Arha
మంచు లక్ష్మికి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ షాకిచ్చింది. నవ్వుతూనే ఓ షాకింగ్ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు మంచు లక్ష్మి ఒక్కసారిగా కంగు తిన్నది. అర్హ వేసిన ప్రశ్నకు కాసేపు ఆలోచనలో పడిపోయినట్లు కనిపించింది. ఇంతకీ అర్హ వేసిన ప్రశ్న ఏమిటో దానికి మంచు లక్ష్మి చెప్పిన సమాధానం ఏమిటో చూద్దాం.
 
అల్లు అర్హతో మంచు లక్ష్మి మాట్లాడుతూ... నువ్వు నన్ను ఏదో అడగాలని అనుకుంటున్నావంటగా, ఏంటది అని అన్నారు. దాంతో.. అవును అన్న అర్హ, నువ్వసలు తెలుగేనా అంటూ షాకింగ్ ప్రశ్న వేసింది. దాంతో మంచు లక్ష్మి కాసేపు షాకై ఆ తర్వాత... నేను తెలుగే పాపా, నేను నీతో తెలుగులోనే కదా మాట్లాడుతున్నా, ఎందుకలా అడిగావ్ అంటూ ప్రశ్నించింది. అందుకు అర్హ.. నీ యాక్సెంట్ అట్లా వుంది మరి అంటూ మరో షాకిచ్చింది నవ్వుతూనే.