1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. A melody song sung by Sid Sriram from 'The Red Bag

Sid Sriram: ది రెడ్ బ్యాగ్ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన మెలోడీ సాంగ్

The Red Ba team
The Red Ba team
కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలతో రూపొందుతున్న చిత్రం ది రెడ్ బ్యాగ్. ఇంకా రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘డిస్కో లైట్’ సాంగ్ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది.
 
ఇక తాజాగా ‘నీ వెనకే’ అంటూ సాగే ఓ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు ఆయన గాత్రం ప్రధాన ఆకర్షణ. ఈ పాటకు తిరుపతి జావన సాహిత్యం అందించారు.. శేఖర్ మోపురి బాణీ ఎంతో ఫీల్ గుడ్‌గా అనిపిస్తోంది. ఇక ఈ పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.
 
మ్యూజికల్ ప్రమోషన్స్‌తో చిత్రయూనిట్ అందరిలోనూ అంచనాల్ని పెంచేస్తోంది. ఈ సినిమా ఆగష్ట్ 14న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
డీప్‌ఫేక్ ఫోటోలు తక్షణం తొలగించండి.. లేదా చట్టపరమైన చర్యలు : మృణాల్ ఠాకూర్